Sri Rama Nee Nama Mokate Nityamura
ఓ రామా శ్రీ రామా
నీ నామ మొకటే నిత్యమురా
నీ రూప మొకటే సత్యమురా
నిలువదు నిలువదు ఈ కాయం
ఇది మరు నిమిషములో మటు మాయం ....నీ నామ ...
1. తన వారెవరో పెద వారెవరో
తనువు రాలితే తదుపరి ఎవరో
ఉన్నంత కాలం ఎంతెంత మొహం
ఎన్నడు తీరునో ఈ వింత దాహం ....నీ నామ ...
2. ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు
నాదనుకున్నది యేదీ మిగలదు
చివరికి మిగిలేది చేసిన పుణ్యం
అది చేయగల్గిన బ్రతుకే ధన్యము ....నీ నామ ...
3. కలిమి లేములు వెలుగు నీడలు
హోరు గాలిలో ఊగే ఓడలు
కడలి దాటితే...కడలి దాటితే
తన గెలుపు కాదు.......
కడలి దాటితే తన గెలుపు కాదు .....
నడుమ మునిగినా ఓటమి కాదు ...ఓ రామా శ్రీ రామా
నీ నామ మొకటే నిత్యమురా
నీ రూప మొకటే సత్యమురా