5. Yenta_Cheekati_Kaalcheno_Intha_Challani_Taaraka_TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY
ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక
ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక
కాలమేమెూ బరువు బరువు కంటికేమో నిదుర కరువు
ఎంత చేదును మింగెనో ఇంత తీయని కోరిక
సూది పోట్లకు గుండె సాచి బాధలను భాష్యాలు వ్రాసి
ఎంత కీర్తిని మోసేనే ఇంత మొత్తని మాలిక
కాంక్షలేమో కదలిపోగా ఆంక్షలెన్నో ఎదురు రాగా
ఎంత ఓర్పు వహించెనో ఇంత తీరని వేడుక
మంచు దాడులు జరుగుతున్నా
మండుటెండలు రగులుతున్నా
ఎంత మట్టిని పీల్చెనో
ఇంత పచ్చని వాటిక
యేరు దాటితే యెవరు వారే
ఏమి లోకం ఓ సినారే
యెంత నటన భరించెనో
ఇంత పల్చని జీవిక