Skip to playerSkip to main content
  • 9 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 7 వ తేదీ గురువారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ చవితి మద్యాహ్నం 12 గంటల 59 నిమిషముల వరకు వుంది. పుష్యమి నక్షత్రం రాత్రి 9 గంటల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు పనులు భాద్యతతో పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.కుటుంబ అవసరాలు తీరుస్తారు. వృషభ రాశి వారికి భార్య సహకారం వుంటుంది . వృత్తి వ్యాపారాలు బావుంటాయి. వృత్తి వ్యాపారాలు సామ్యం గా వుంటాయి. మిధున రాశి వారికి ధన ప్రాప్తి వుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. కర్కాటక రాశి వారు పిల్లలు చేయు పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇంటి అవసరాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. సింహ రాశి వారు అనుకూల సమయం.వృత్తి వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి.పిల్లల పట్ల భాద్యతగా ఉండాలి. తలచిన పనులు పూర్తి చేస్తారు. కన్య రాశి వారు ధన ప్రణాలికలు అనుకూలిస్తాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. తుల రాశి వారుఅనుకున్న పనులు బాధ్యతతో పూర్తి చేయవలసి వుంటుంది. దానం సులువుగా చేతికందుతుంది.. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన వుంటుంది. ధనం కోసం ప్రయత్నం చేయవలసి వుంటుంది..ధనూ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. శరీర శ్రమ కలదు. రుణ బాధలు కలిగే అవకాశం వుంది. మకర రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. పిల్లల పట్ల శ్రద్ద వహించాలి. కుంబ రాశి వారికి చేయదలచిన పనులు పట్టుదలతో చేస్తారు. అవకాశాలు చేజారే సూచనలున్నాయ్.. మీన రాశి వారు తండ్రి ఆశీర్వాదం అవసరం. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

Category

🗞
News

Recommended