Days before the crime of a Hindu man by the family of his Muslim girlfriend triggered outrage among Hindutva groups, a pro-Hindutva Facebook page published a list of over 100 inter-faith couples with links to their Facebook profiles and asked its followers to “hunt down the men” mentioned in the list.
'లవ్ జిహాద్' ఈమధ్య ఎక్కువగా విన్పిస్తున్న పదం. అలాగే 'లవ్ జిహాద్' పేరుతో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి కూడా . లవ్ జిహాద్ , హిందూ మహిళలను ముస్లిం పురుషులు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఈ పదం సూచిస్తుంది. అలాగే ముస్లిం మహిళలను హిందూ పురుషులు పెళ్లి చేసుకున్నా కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో చాలా వివాహాలు వివిధ మత నియమాళులు, వ్యక్తిగత చట్టాల కింద జరుగుతాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా మతాంతర వివాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే.
కానీ ఎక్కడోచోట లవ్ జిహాద్ పేరిట హత్యలు జరుగుతూనే ఉన్నయి. తాజాగా తన కుమార్తె ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని గ్రహించిన ఓ కుటుంబం.. పరువు కోసం ఆమె ప్రేమిస్తోన్న యువకుడిని గొంతు కోసి హతమార్చిన ఉదంతం దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీలోని రఘువీర్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువతి(20)ని ఫోటోగ్రాఫరుగా పనిచేస్తున్న అంకిత్ సక్సేనా(23) అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. గత మూడేళ్లుగా వారు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
అయితే యువతి కుటుంబం మాత్రం వారి ప్రేమను అంగీకరించలేదు. కారణం.. ఆ యువకుడు వారి మతానికి చెందినవాడు కాకపోవడమే. కూతురి చేష్టలతో తన కుటుంబ పరువు పోతోందని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. మొదట తన కుమార్తెను ప్రేమిస్తోన్న అంకిత్‌ను యువతి కుటుంబ సభ్యలు హెచ్చరించారు. అయినా ఆ ప్రేమికుల మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. దీంతో ఇక లాభం లేదని, నలుగురికి తెలిసి తమ పరువు పోతోందని, ఏదో ఒకటి చేయాలని యువతి కుటుంబం నిశ్చయించుకుంది. గురువారం రాత్రి అంకిత్‌ను పిలిచి మళ్లీ యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారి నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే.. ఆగ్రహం పట్టలేక యువతి తల్లిదండ్రులు, తమ్ముడు, మామ కలిసి అంకిత్‌పై దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. ఆ యువతి మామ కత్తితో అతడి గొంతు కోసేశాడు.