Skip to playerSkip to main content
  • 9 years ago
Actor Mohan Babu's school Srividyaniketan managmentremoved teacher for wearing pant and jeans.

నటుడు మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై రాణిరవడ(43) అనే మహిళా టీచర్ న్యాయ పోరాటానికి దిగింది. కేవలం తన దుస్తుల్ని కారణంగా చూపించి ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరో టీచర్ కూడా అలాంటి దుస్తులే వేసుకొస్తున్నా.. కావాలని తనను మాత్రమే స్కూల్ నుంచి తప్పించారని అంటోంది.
ఫార్మల్ ప్యాంట్, లాంగ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుని స్కూల్‌కు వచ్చిందన్న కారణంతో రాణిరవడను శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తొలగించింది.గత డిసెంబర్ 7న పాఠశాల యాజమాన్యం ఆమెకు తొలగింపు ఉత్తర్వులను ఇచ్చింది.
శ్రీ విద్యానికేతన్ నియామవళికి విరుద్దంగా రాణిరవడ టీచర్ క్లాజ్ 11, 13లను ఉల్లంఘించిందని యాజమాన్యం ఆరోపిస్తోంది. సకాలంలో సిలబస్ కూడా పూర్తి చేయలేదని ఆరోపించింది. స్కూల్ ప్రమాణాలకు విరుద్దంగా వస్త్రధారణ ఉండటం వల్లే ఆమెను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది సెప్టెంబర్ 4న తాను శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరినట్లు టీచర్ రాణి తెలిపారు. సిలబస్ పూర్తి చేయలేదన్న ఆరోపణలు తనను తొలగించడం కోసం సృష్టించినవే అన్నారు. అమర్యాదకరంగా తనను తొలగించారని పేర్కొన్నారు.

Category

🗞
News

Recommended