The parents of a 27-year-old man, who lost life in 2016, used his cryopreserved semen to have grand children through a surrogate pregnancy.
కొడుకు చనిపోవడంతో వారసులు లేరని చింతిస్తున్న బాధితులకు మగ కవలల రూపంలో కొడుకు చనిపోయిన బాధ దూరమైంది.ఇద్దరు మనమళ్ళలో తమ కొడుకును చూసుకొంటామని ఆ తల్లిదండ్రులు ఆనంద పడుతున్నారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకొంది. మహరాష్ట్రలోని పూణెకు చెందిన ప్రథమేష్ పాటిల్ ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్ళాడు. 2013లో ఆరోగ్య సమస్యల కారణంగా పరీక్షలు చేయించుకొన్నాడు. అయితే అతడికి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని తేలింది. కీమోథెరపీ చికిత్సను తీసుకోవాలని పాటిల్‌కు సూచించారు. కీమోథెరపీ కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు ప్రథమేష్ పాటిల్‌కు చెప్పారు. కీమోథెరపీకి ముందే ప్రథమేష్ పాటిల్ అనుమతితో అతడి వీర్యం శాంపిళ్ళను తీసి భద్రపర్చారు.
కీమో థెరపీ కారణంగా క్యాన్సర్ వ్యాధి కొంత తగ్గినట్టు కన్పించింది. అయితే వ్యాధి నుండి పాటిల్ కోలుకొంటున్నాడని కుటుంబసభ్యులు భావించారు. కానీ, క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టింది. 2016లో ప్రథమేష్ మరణించాడు. మరణించే సమయానికి ప్రథమేష్కు వివాహం కాలేదు. కొడుకు చనిపోయాడు. వారసులు లేరని తల్లి రాజ్శ్రీ పాటిల్ తీవ్ర మనోవేదనకు గురైంది.
దీంతో పాటిల్ వీర్యాన్ని జర్మనీలో భద్రపర్చిన విషయం గుర్తుకు వచ్చింది. దీంతో ఆమె పూణెలోని సహ్యాద్రి ఆసుపత్రి వైద్యులను సంప్రదించి తన భాదను వివరించింది. సహ్యద్రి ఆసుపత్రి వైద్యులు జర్మనీ నుండి ప్రథమేష్ వీర్యాన్ని పూణెకు తెప్పించారు.
ప్రథమేష్ కుటుంబంలో ఓ మహిళ నుండి అండాలను సేకరించి, ప్రథమేష్ వీర్యంతో నాలుగు పిండాలను రూపొందించారు. అయితే ఈ పిండాలను తన గర్భంలో ఉంచుకోవడానికి ప్రథమేష్ తల్లి రాజ్శ్రీ ముందుకు వచ్చింది. అయితే అప్పటికే ఆమె వయస్సు 49 ఏళ్ళు. అయితే ఆమెకు వయస్సు సహకరించిందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ప్రథమేష్ సోదరి గర్భంలో రెండు పిండాలను గత ఏడాది మే మాసంలో ప్రవేశపెట్టారు.