• 9 years ago
The YCP Chief Jagan will give another shock to TDP with unexpected decision...That is their party MLA's resignation...Is it true? YCP MLAs will really resign?

ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహాలు,ప్రతి వ్యూహాలతో ఎపి షేక్ అయిపోతోంది. టిడిపి-వైసిపి, టిడిపి-బిజెపి, వైసిపి-జనసేన ఇలా వివిధ పార్టీలు పరస్పరం తలపడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అంతకంతకూ వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో తన అనూహ్యమైన వ్యూహాలతో టిడిపి అధినేత చంద్రబాబును ఇరుకున పెడుతున్న వైసిపి అధినేత జగన్ తాజాగా మరోసారి ఆ పార్టీపై ఒత్తిడి పెంచేందుకు మరో షాక్ ఇచ్చేందుకు సంసిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6 న రాజీనామా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వైసిపి ఈసారి టిడిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు మరో వ్యూహంతో సిద్దమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తాజా వ్యూహం ప్రకారం రాజ్యసభ ఎన్నికల తరువాత వైసిపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించనున్నట్లు తెలిసింది. టిడిపి ప్రభుత్వం తీరు వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, అందుకు నిరసనగా తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం ద్వారా టిడిపిని డిఫెన్స్ లోకి నెట్టాలనేది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.
వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని త్యాగాలకు సిద్దపడినట్లు అవుతుంది. రాష్ట్రం కోసం ప్రజల కోసం తాము ఎంతకైనా తెగిస్తామని, మాటల పోరాటం కాకుండా చేతల్లో చూపుతామనే అభిప్రాయం ప్రజల్లో కలిగించేందుకు వైసిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయడం అంటే సీరియస్ వ్యవహారమే కాబట్టి ప్రజల దృష్టిలో మంచి మార్కులు కొట్టేందుకు వైసిపి ఈ రిస్క్ తీసుకోవాలని భావిస్తోందట. మరోవైపు అధికార టిడిపి పార్టీని ఈ నిర్ణయంతో అనేక విధాల ఇబ్బంది పెట్టొచ్చని అంచనా వేస్తోందట

Category

🗞
News

Recommended