ఉదయాన్నే ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ని ప్రిపేర్ చేయడమన్నది ప్రతి సారి అంత సులువైన విషయం కాదు. కొన్ని సార్లు బ్రేక్ ఫాస్ట్ ఏమిటన్న విషయం గురించి ఒక స్పష్టమైన ఆలోచన కుదరదు. డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ డిష్ ను తయారుచేయడం అందులోనూ తక్కువసమయంలో తయారుచేయడం కాస్త కష్టతరమైన విషయమే. మ్యాంగో రైస్ లేదా మావిడికాయ పులిహోర అనేది మీ టేస్ట్ బడ్స్ ని ఉత్సాహపరచడంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మంచి చేస్తుంది. వివిధ సాంప్రదాయ ఇండియన్ స్పైసెస్ కలయికలో పచ్చి మ్యాంగో ఫ్లేవర్ అనేది నోరూరిస్తూ మీ టేస్ట్ బడ్స్ ను సంతృప్తిపరుస్తుంది. మావిడికాయ పులిహోర ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శెనగపప్పు, మినప్పప్పూ, పల్లీలు మీకు తగినంత ప్రోటీన్ ను అందిస్తాయి. అందువలన, ఇది పెర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీగా ముందుంటుంది.