• 9 years ago
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్‌పై న్యూఢిల్లీ పోలీసులు చార్జీషీట్‌ను దాఖలు చేశారు. శశిథరూర్ భార్య సునంద్ పుష్కర్‌ కేసులో నాలుగేళ్థ తర్వాత పోలీసులు సోమవారం నాడు ఛార్జీషీట్ దాఖలు చేశారు.
పాటియాల మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేందర్ సింగ్ ఎదుట ఈ ఛార్జీషీట్ ను పోలీసులు సమర్పించారు. అయితే సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకొందని పోలీసులు నిర్ధారించారు. ఇది హత్య కాదని చార్జీషీటులో పోలీసులు అభిప్రాయపడ్డారు.
సునంద్ పుష్కర్ ను ఆత్మహత్య చేసుకొనేలా శశిథరూర్ ప్రేరేపించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ళ తర్వాత ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను మే 24 వ తేదికి కోర్టు వాయిదా వేసింది. నాలుగేళ్ళ క్రితం ఢిల్లీలోని ఓ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఆ సమయంలో ఈ కేసు సంచలనంగా మారింది.

Category

🗞
News

Recommended