Skip to playerSkip to main content
  • 8 years ago
The 11th edition of the Indian Premier League starts on April 4 and will continue till May 27, 2018. The first match is between defending champions Mumbai Indians and Chennai Super Kings at the Wankhede Stadium.

ఐపీఎల్ 2018 సీజన్ ఆదివారంతో ముగిసింది. టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన పైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది.
2008లో ఆరంభమైన ఈ లీగ్‌కు క్రికెట్ ప్రేమికులు బ్రహ్మరథం పట్టడంతో ప్రతిఏడాది టోర్నీ విజయవంతంగా సాగుతోంది. ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ దిశను మార్చే విధంగా ప్రభావితం చేసింది. ఏటికి ఏటికి టోర్నీపై అంచనాలు పెరిగిపోవడంతో పాటు అభిమానులను ఆకర్షించేందుకు ఆటగాళ్లు సైతం తమ శక్తివంచన లేకుండా ఆడుతున్నారు.
దీంతో ఐపీఎల్ అంటేనే రికార్డులు అనేలా పేరు తెచ్చుకుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌లో కూడా ఐపీఎల్‌లో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను అభిమానులు వీక్షించారు. ఈ సీజన్‌లో చాలా వరకు మ్యాచ్‌లు ఆఖరి వరకు ఫలితాన్ని తేల్చే విధంగా జరిగాయి. ఈ క్రమంలో ఈ సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్‌తో పాటు పలు విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదయ్యాయి.

Category

🥇
Sports

Recommended