Though it was never declared as the Telangana state's official song, "Jaya Jayahe Telangana" has become so popular over the years. Written by renowned writer Ande Sri, Jaya Jayahe Telangana was sung all over the state during the separate state agitations and even during the celebrations of new state formation.
బాధనైనా.. సంబురాన్నైనా.. గుండె నుంచి గొంతులకు ఒంపుకున్నది తెలంగాణం. ఆ గొంతులు నెత్తురసొంటి పాటలను గానం చేసినయి. జంగు సైరన్ అయి కొట్లాటకు నెగడు రాజేసినయ్.. దు:ఖశీలిన గుండెలకు కొత్త ఊపిరి పోసినయ్. అందుకే పాటకు తెలంగాణ శిగమూగింది.. కండ్ల నీళ్లు తుడుసుకుని ఢిల్లీకి కవాతు చేసింది. ఈ నేల మీద ఏ గుండెను అలుముకున్నా దాని గోస లయకార శబ్దమై వినిపిస్తది. సామూహిక గాన క్షేత్రమై పోరు చరిత్రను ఎరుక చేస్తది. పాట గురించి చెప్పాలన్నా.. మళ్లీ ఓ కొత్త పాటే పుట్టుకొస్తది. పాటతో తెలంగాణది పేగుబంధం. కానీ ఇప్పుడెందుకో ఆ పాట చిన్నబోయింది?.. దాని కంటి రెప్పల కింద చిన్న తడి మెరుస్తాంది.. కానీ కానొచ్చేది ఎందరికీ