When the soccer crazy Kolkatans got first taste of live television coverage during the Spain World Cup in 1982, Kolkata-based couple Pannalal and Chaitali Chatterjee decided to take a step further.
అప్పట్లో .. (1982)లో స్పెయిన్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ అర్జెంటీనా మాంత్రికుడు మారడోనా మ్యాజిక్కు ప్రపంచమంతా సాకర్ ఫీవర్‌తో ఊగిపోయింది. 1982లో జరిగిన ఆ వరల్డ్‌కప్ తొలిసారి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లు సాకర్ మజాను ఆస్వాదించారు. ఈ క్రమంలోనే కోల్‌కతాకు చెందిన పన్నాలాల్ (85), చైతలీ (76) దంపతులు 1982లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించినప్పటి నుంచి ఇక ప్రతి ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూడాలని నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత నుంచి ప్రతీ వరల్డ్‌కప్ మజాను వీరు నేరుగా స్టేడియాల్లో కూర్చుని ఆస్వాదిస్తున్నారు. 1986లో అర్జెంటీనా వరల్డ్‌కప్ విజేతగా నిలవడం కళ్లారా చూశారు. ఇప్పుడు 10వసారి విశ్వకప్‌ను వీక్షించేందుకు రష్యా ప్రయాణానికి రెడీ అవుతున్నారు ఈ వృద్ధ దంపతులు. ప్రస్తుతం పన్నాలాల్ వయసు 85 ఏళ్లుకాగా.. ఆయన భార్యకు 76 సంవత్సరాలు.