• 8 years ago
AP CM Chandrababu Naidu indirectly targeted Telangana CM KCR over federal front. Babu said iam not in hurry like someone to interfere in national politics
#telangana
#kcr
#satire
#chandrababunaidu
#federalfront

మొన్నీమధ్యే కదా!.. 'ఫ్రంట్ లేదు ఏమీ లేదు.. పార్టీలో ఏదో అంతర్గత సమస్య ఉన్నట్టుంది. దాన్ని కవర్ చేసుకోవడానికే కేసీఆర్ ఫ్రంట్ అని బయలుదేరిండు..' అని ఏపీ సీఎం చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ పై తీసికట్టు వ్యాఖ్యలు చేసింది. తాజాగా మళ్లీ అదే రకమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు బాబు. అయితే ఈసారి సూటిగా కాకుండా పరోక్షంగా కేసీఆర్ పై ఆయన సెటైర్ వేశారు.
వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశంతోపాటు పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు గతంలో కన్నా ఎక్కువ బలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. 'అందరిలా నేను కుప్పి గంతులు వేయను.దాని పరిస్థితులు, పరిమితులు నాకు తెలుసు' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్నాక.. ఇవి కేసీఆర్ ను ఉద్దేశించినవే అన్న అభిప్రాయం ఎవరికైనా కలగకమానదు.

Category

🗞
News

Recommended