Payakaraopeta MLA Anitha visited Pawan kalyan fan's family who with current shock. On the other hand, Pawan kalyan will visit fan's family on Thursday.
పవన్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో మృత్యువాతన పడిన అభిమాని కుటుంబాన్ని టీడీపీ ఎమ్మెల్యే అనిత పరామర్శించారు. పవన్ కు స్వాగతం పలుకుతూ పాయకరావుపేటలో ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ కు గురై నాగరాజు, భీమవరపు శివ అక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానుల మృతి తనను కలచి వేసిందని, వారి కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని పవన్ కళ్యాణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ క్రమంలో పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత పవన్ అభిమాని శివ కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రస్తుతం విశాఖ జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం పాయకరావుపేటలో పర్యటించనున్నారు. పవన్ పర్యటన నేపధ్యంలో ఆయన అభిమానులైన టి.నాగరాజు, భీమవరపు శివ అనే ఇద్దరు యువకులు మంగళవారం అర్ధరాత్రి దాటాక పాయకరావుపేట ప్రధాన రహదారి పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా 33కేవీ విద్యుత్ తీగలకు ఫ్లెక్సీ ఇనుప రాడ్స్ తగిలడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే.