Skip to playerSkip to main content
  • 8 years ago

ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకొని, స్వీట్ పాన్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ దారుణ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. నిందితుడు పాన్ షాప్ యజమాని. వారి ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి, పెళ్లి పేరుతో లొంగదీసుకొని మోసం చేస్తున్నాడు. నిందితుడి పేరు ఉపేంద్ర. అతని బారిన ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ కూడా పడింది.
ఆమెను కూడా ఇలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. కానీ ఇప్పుడు వదిలేసేందుకు సిద్ధపడ్డాడు. దీంతో ఆమె కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది.
ఉపేంద్ర నగరంలో పలు ప్రాంతాల్లో పాన్ షాపులు నిర్వహిస్తున్నారు. అతను ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలకు రిక్వెస్టులు పెడతాడు. వారితో పరిచయం పెంచుకుంటాడు.వారిని ట్రాప్‌లోకి దించుతాడు. స్వీట్ పాన్‌లో మత్తు మందు కలిపి ఇస్తాడు. వారిపై దారుణానికి పాల్పడి, అందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు తీస్తాడు.వాటిని చూపించి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడతాడని తెలుస్తోంది. ఇందులో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు
అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. తనకు నిందితుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడని, వీడియోలు తీసి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఫేస్‌బుక్ రిక్వెస్ట్ పెట్టాడని, పరిచయం పెరిగాక ఇష్టమని చెప్పాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపింది.

Category

🗞
News

Recommended