BJP woman leader and Former Minister Purandeswari takes on Andhra Pradesh CM Nara Chandrababu Naidu.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజులు సోమవారం నిప్పులు చెరిగారు. తన వైఫల్యాలనుకవర్ చేసుకునేందుకే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయారని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఏపీ ద్రోహిగా చూపే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఏపీకి చేసింది మాత్రం ఏమీ లేదన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు.
బీజేపీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పురంధేశ్వరి అన్నారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్న కారణంగానే నవయుగ పనులు వేగవంతం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.
పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నవయుగ సంస్థను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీకి పిలిపించి ఆదేశాలు జారీ చేశారన్నారు. నవయువక సంస్థపై గడ్కరీ చేసిన ఒత్తిడి గురించి రాష్ట్ర ప్రజలకు టీడీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను సహించేది లేదని హెచ్చరించారు.