India will host Afghanistan in the latter's debut Test match at M Chinnaswamy Stadium in Bengaluru on Thursday (June 14).
భారత్-ఆప్ఘనిస్థాన్ దేశాల మధ్య చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. టెస్టు హోదా పొందిన తర్వాత ఆప్ఘనిస్థాన్ తన తొలి టెస్టు మ్యాచ్‌ని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రహానే నాయకత్వంలోని టీమిండియాతో తలపడనుంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ గురువారం(జూన్ 14) నుంచి ప్రారంభం కానుంది.
అస్గర్ సారథ్యంలోని ఆప్ఘనిస్థాన్ జట్టు ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న టీమిండియాతో తలపడుతుండటంతో ఈ టెస్టుపై ఎంతో ఆసక్తి నెలకొన్నది. మెడ గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏకైక టెస్టు నుంచి తప్పుకోవడంతో ఆతడి స్థానంలో వైస్ కెప్టెన్ రహానే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
ఆప్ఘనిస్థాన్ దేశానికి జూన్ 14 మరిచిపోలేని రోజు. సుదీర్ఘ చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్‌లోకి ఆప్ఘన్ అడుగపెట్టడమే ఇందుకు కారణం. ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆప్ఘనిస్థాన్ టెస్టు క్రికెట్‌లో కూడా సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది.
మ్యాచ్ టైమింగ్: ఉదయం 9:30 గంటలకు
ఏ ఛానెల్‌లో ప్రసారం: భారత్-ఆప్ఘన్ ఏకైక టెస్టు మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తోంది. హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్