India captain Virat Kohli said "lethal" wrist spinner Kuldeep Yadav will have a pivotal role to play during the rest of his side's tour of England. Yadav produced a man-of-the-match display as he finished with 5-24 in India's emphatic eight-wicket win over England in the first T20I at Old Trafford.
విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియాలో ఇప్పడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు కుల్దీప్ యాదవ్. మరి బౌలింగ్ టీంలో కుల్దీప్ యాదవ్‌నే నమ్ముకున్న.. జట్టుకు అతను ఇలా సమాధానమిచ్చాడు.
బ్యాట్స్‌మెన్ సిక్సర్లు కొడతారేమోనన్న భయం తనకెప్పుడూ ఉండదని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. 'నేను క్రికెట్ ఆడడం మొదలు పెట్టినప్పుడు.. బ్యాట్స్‌మెన్ సిక్స్‌లు కొట్టేలా నా కోచ్ కపిల్ పాండే నాతో బౌలింగ్ చేయించేవాడు. అసలు మ్యాచ్‌లో సిక్స్‌లు కొడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు ఆ సాధన నాకు ఉపయోగపడింది' అని చెప్పాడు.
‘బ్యాట్స్‌మెన్ సిక్స్‌లు కొడితే నేను ఒత్తిడికి గురికాను. ఇలా ఉండడం నా కెరీర్ తొలినాళ్లలోనే నేర్చుకున్నా. సిక్స్‌లు కొడతారని నేను భయపడను. ‘వికెట్లు తీయాలనుకుంటే బంతిని తిప్పాలి. బంతి తిరగట్లేదంటే ఆ స్పిన్నర్.. స్పిన్నర్ కాదని అర్థం' అని చెప్పాడు. కుల్దీప్ తమను పూర్తిగా బోల్తా కొట్టించాడని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అన్నాడు. అతడు చాలా బాగా బౌలింగ్ చేశాడని చెప్పాడు.