Skip to playerSkip to main content
  • 8 years ago
కేంద్రంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రానికి మొదటి స్థానం రాకుండా కేంద్రం అడ్డుకోవాలని చూసిందని చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలో ప్రజాదర్బార్‌ హాలులో గురువారం నిర్వహించిన తెదేపా కార్యశాలకు హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని చంద్రబాబు ఈ సమావేశంలో ఏకరువు పెట్టారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రానికి తొలి స్థానం రాకుండా ఎంత అడ్డుకుందామని ప్రయత్నించినా కేంద్రం ఏం చేయలేకపోయింది. అక్కడికీ కొన్ని అంశాలు తొలగించారు. విధిలేని పరిస్థితుల్లోనే మనకు సులభతర వాణిజ్యంలో మొదటిస్థానం ఇచ్చారు. సమర్థమైన, నీతివంతపాలనకు ఇదే నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై లేని నమ్మకాన్ని పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌పై చూపించారు అని టిడిపి మీటింగ్ లో చంద్రబాబు చెప్పారు. అయితే సులభతర వాణిజ్యంలో రాష్ట్రానికి మొదటిస్థానం వచ్చినా మన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలే తేలిగ్గా తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

Category

🗞
News
Comments

Recommended