Skip to playerSkip to main content
  • 8 years ago
The government has nominated four member to the Rajya Sabha for their distinguished services to the the society. They included academician Rakesh Sinha, eminent Dalit leader Ram Shakal, famous dancer Sonal Mansingh and stone sculptor Raghunath Mohapatra, who is internationally renowned for stone carving.
#government
#rajyasabha
#ramnathkovind
#ramshakal

రాజ్యసభకు కొత్తగా నలుగురు ప్రముఖులను నామినేట్‌ చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. బీజేపీ మాజీ ఎంపీ రామ్‌ శకల్‌, ప్రముఖ రచయిత రాకేశ్‌ సిన్హా, కళాకారుడు రఘునాథ్‌ మొహ పాత్ర, క్లాసికల్‌ డ్యాన్సర్‌ సోనాల్‌ మన్‌సింఘ్‌లను రాష్ట్రపతి శనివారం రాజ్యసభకు నామినేట్‌ చేశారు. రాజ్యసభలో నామినేటెడ్‌ సభ్యులుగా ఉన్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెండూల్కర్‌, బాలీవుడ్‌ నటి రేఖ, పారిశ్రామిక వేత్త అను అఘా, న్యాయవాది కె పరాశరణ్‌ ఇటీవలే పదవీ విరమణ చేసిన నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్త సభ్యులను రాష్ట్రపతి శనివారం నామినేట్‌ చేశారు.
రాకేష్ సిన్హా ఢిల్లీకి చెందిన ఇండియా పాలసీ ఫౌండేషన్‌కు వ్యవస్థాపకులు. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ రీసెర్చ్‌లో సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ రచయిత, కాలమిస్ట్ కూడా.

Category

🗞
News

Recommended