Skip to playerSkip to main content
  • 8 years ago

పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ పోరాటం భావి తరాల కోసమేనన్న విషయం అందరికీ స్పష్టం కావాలని వ్యాఖ్యానించారు.
సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని.. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించాలని చెప్పారు.
తాను ఢిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని, ఒక లక్ష్యం కోసం చేస్తున్న పోరాటానికి అందరి మద్దతు కూడగట్టాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. పార్టీ ఎంపీలతో బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఉపదేశించారు.

Category

🗞
News

Recommended