Skip to playerSkip to main content
  • 8 years ago


టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తాను ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. 11 బాల్స్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ దారి పట్టాడు. ఇటీవల భారత అండర్-19 జట్టులోకి ఎంపికైన అర్జున్.. శ్రీలంక అండర్-19 జట్టుతో గత మంగళవారం ఆరంభమైన నాలుగు రోజుల యూత్‌ టెస్టుతో అరంగేట్రం చేశాడు. తుది జట్టులోకి ఆల్‌రౌండర్ కోటాలో ఎంపికైన అర్జున్ మ్యాచ్‌లో తానేసిన రెండో ఓవర్‌ ఆఖరి బంతికే వికెట్ పడగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.కానీ, బ్యాటింగ్‌లో మాత్రం అర్జున్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అర్జున్ టెండూల్కర్ 11 బంతులాడి కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. శ్రీలంక అండర్ 19 జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో షషిక దుల్షాన్‌ బౌలింగ్‌లో బంతిని హిట్ చేయబోయి.. ఫీల్డర్ పసిందుకి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విశేషం ఏమిటంటే.. సచిన్ కూడా పాకిస్తాన్‌తో తాను ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లో డకౌటయ్యాడు.

Category

🥇
Sports

Recommended