In a significant labour reform, the Tamil Nadu government has issued a notification to regulate the payment of domestic help in the state. According to the notification, a person will face a jail term up to seven years if he/she is found paying less than Rs 37 per hour to his/her domestic servants. The government has also issued guidelines related to pay for home nurses and semi-skilled workers.
#domestichelp
#labourreforms
#tamilnadugovt
#Maid
#Salary
తమిళనాడు ప్రభుత్వం ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో పనిచేసే పనిమనిషికి గంటకు రూ.37 చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ చెల్లించని పక్షంలో ఇంటి యజమానిని ఏడేళ్ల పాటు కటకటాల వెనక్కు పంపుతామని పేర్కొంది. అసంఘటిత రంగాల్లో కూడా కార్మిక సంస్కరణలు చేపట్టాలని తమిళ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే పనిమనుషులకు కనీస వేతనం గంటకు రూ.37 చెల్లించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. నైపుణ్యత కలిగిన వ్యక్తులకు అంటే ఇంటికొచ్చి చూసే నర్సులకు , వంట మనుషులకు, తోటమాలికి గంటకు రూ.39 చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇలా రోజుకు 8గంటలు లెక్కలోకి తీసుకుని దానికణుగుణంగా డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం చెప్పింది. బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇంటిని శుభ్రపరచడం లాంటి పనులకు నెలకు రూ. 6836 చెల్లించాలని చెబుతూ... క్వాలిఫైడ్ హోం నర్స్‌లకు నెలకు రూ.8,051 చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో ఆహారం, బట్టలు, ఉండేందుకు నివాసంలాంటి వాటిని మినహాయించింది.