YSR Congress Party Rajya Sabha MP Vijaya Sai Reddy says YSRCP will not support NDA in Rajya Sabha Dy. Chairman's post.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలుగుదేశం సహా అన్ని పార్టీలు భావించాయి. కానీ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మంగళవారం ఊహించని షాకిచ్చారు. బీజేపీ, ఎన్డీయే కూటమిలోని పార్టీలు కూడా వైసీపీపై ఎంతోకొంత ఆశతో ఉన్నాయి. వారి ఆశలపై విజయసాయి నీళ్లు చల్లారు. తాము రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో వారి అభ్యర్థికి మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పారు.
#vijayasaireddy
#chandrababunaidu
#manaswini
#chandrasekharrao
#nitishkumar
#bihar