Skip to playerSkip to main content
  • 8 years ago
Hijras Seruois on TDP MP Shivaprasad over his transgender get up. For that Hijras complained in Nandyal Police Station that they were humiliated by MP in Parliament premises.
#andhrapradesh
#nandhyal
#hijras
#complaint
#policestation
#tdp
#transgender
#MP
#ShivaPrasad

టిడిపి ఎంపీ శివప్రసాద్ పై హిజ్రాలు ఆగ్రహం చెందారు. పార్లమెంటు ముందు తమ వేషధారణతో తమను ఎంపి అవమానించారని హిజ్రాలు నంద్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణంలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనలో భాగంగా ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషధారణలో తన నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ఆయన శుక్రవారం హిజ్రా వేషంలో ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం తెలుగు దేశం పార్టీ పోరాటంలో భాగంగా టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలో 18వ రోజూ ఆందోళన చేపట్టారు. రోజుకో వేషధారణతో ఈ ఆందోళనలో పాల్గొంటున్న చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ గురువారం హిట్లర్ వేషం ధరించగా, శుక్రవారం ట్రాన్స్ జెండర్ వేషధారణతో...చెవులకు రింగులు, భుజంపై ఎరుపు రంగు పైట, తలలో కనకాంబరాలు పెట్టుకుని పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చారు.

Category

🗞
News
Comments

Recommended