Skip to playerSkip to main content
  • 8 years ago
India wicketkeeper Wriddhiman Saha, who has recovered from a shoulder injury, has said he is not thinking about selection right now and his focus is on doing well for Bengal in the Syed Mushtaq Ali T20 tournament.
#rishabhpant
#wriddhimansaha
#teamindia
#testcricket
#dhoni
#competitor
#syedmushtaqali
#t20tournament
#australia
#bengalteam

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తనకు పోటీదారు కాదని సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పేర్కొన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా ఇంగ్లాండ్ వెళ్లి మోచేతికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టు తరుపున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా సాహా ఓ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ

గాయం తర్వాత ఆటగాళ్లతో కలవడం గొప్పగా అనిపిస్తోంది. ఒక ఆటగాడిగా తిరిగి జట్టులోకి అడుగుపెట్టడం కన్నా ఆనందం ఏముంటుంది. చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్నట్టు నేను భావించలేదు. రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకున్నా అంతే. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో బెంగాల్‌కు సాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నా" అని సాహా అన్నాడు.నేను జట్టుకు దూరమైనప్పుడు రిషబ్ పంత్ అవకాశం అందుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని ఎవరైనా అందిపుచ్చుకోవాలనే ప్రయత్నిస్తారు. రిషబ్ పంత్ కూడా అలాగే చేశాడు. అతడిని నాకు పోటీదారుగా భావించను. నిజానికి పంత్‌ ఎన్‌సీఏకు వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి చాలా సమయం గడిపాం" అని సాహా తెలిపాడు.

Category

🥇
Sports

Recommended