the Enforcement Directorate (ED), probing a money laundering issue, is now looking into how MNS chief Raj Thackeray walked away with a profit of Rs 20 crore in 2008 without any investment in Matoshree Realtors -- part of Kohinoor CTNL. Kohinoor CTNL has been constructing Dadar's Kohinoor Square towers.
enforcement directorate
#mnschief
#raj thackeray
#profit
#investment
#Kohinoorsquaretowers
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పోకస్ చేసింది. మాతో శ్రీ రియల్టర్ కంపెనీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే రూ.20 కోట్ల లాభం పొందడంపై ఆరాతీస్తోంది. ఈ మేరకు ఆయనను విచారించేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది. పెట్టుబడులపై ఆరా, లాభం తదితర అంశాలపై పూర్తి వివరాలను సేకరించింది. కోహినూర్ సీటీఎన్ఎల్ కంపెనీలో మాతోశ్రీ రియల్టర్స్ భాగస్వామిగా ఉంది. 2008లో మాతో శ్రీ సంస్థ తరఫున రాజ్ ఠాక్రే భాగస్వామిగా ఉన్నారు. అయితే పెట్టుబడులు మాత్రం పెట్టలేదు. ముంబైలోని దాదార్లో కోహినూర్ స్వ్కేర్ టవర్ నిర్మాణం జరిగింది. కానీ రాజ్ ఠాక్రేకు మాత్రం లాభాల్లో రూ.20 కోట్లను కోహినూర్ కంపెనీ అందజేయడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఏం జరిగిందనే అంశంపై ఈడీ విచారణ జరుపుతుంది. అప్పటి లావాదేవీలకు సంబంధించి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ నిబంధనలను ఉల్లంఘించిందని ఈడీ అధికారులు నిర్ధారించారు.