దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ దేశీయ మార్కెట్ కోసం సోల్ కాంపాక్ట్-ఎస్‌యూవీని విడుదల చేయనుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో సందర్భంగా ఎస్‌యూవీ పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించడంతో కియా మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
కియా మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ ఇంజన్లతో సోల్ కాంపాక్ట్-ఎస్‌యూవీని విడుదల చేయనుంది. కానీ
పెట్రోల్ మోడళ్లను మాత్రమే భారతదేశంలో విడుదల చేయనున్నారు.పెట్రోల్ మోడల్ 2.0 లీటర్, 1.6 లీటర్ ఇంజన్ ఆప్షన్లతో విడుదల కానుంది.