సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుఫాన్ గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు నేనింతగా పిడికెడు మట్టే కావచ్ఛు కానీ కలమెత్తితే నాకొక దేశపు జెండా కున్నంత పొగరుంది ( గొరిల్లా కావ్యం లో 4వ కవిత , ఆధునిక మహాభారతం లో పశుపర్వం , 4వ కవిత )