టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్‌గా పేరుగాంచిన శశి వంగపల్లి... తన క్లోతింగ్ ఫ్రాంచైజ్ ను వైజాగ్ నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి... విజయవాడ, వైజాగ్ లోనూ స్టోర్స్ ను ప్రారంభించారు. ప్రముఖ నటీమణులు ఇలియానా, రాశీఖన్నా ఈ స్టోర్ ను ప్రారంభించడం మరో విశేషం. టెంపుల్ థీమ్ తో ప్రారంభమైన ఈ వస్త్రదుకాణం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా శశి వంగపల్లి మాట్లాడుతూ నగరంలో ముగ్ధ స్టోర్ ను ప్రారంభించడంతో తన కల సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమమైన కలెక్షన్స్ తో పాటూ అందుబాటు ధరలు తమ ప్రత్యేకతన అని వెల్లడించారు.
#sashiVangapalli
#tollywood
#Celebrity
#Designer
#Vizag
#Iliyana
#Ileana
#rashikhanna
#temple
#clothstore
#mugdha