కరోనా కేసుల కారణంగా సీ-టెట్ పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా వేస్తూ వచ్చింది. ఈ ఏడాది ఎట్టకేలకు పరీక్షలు నిర్వహించాలని భావించినా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ఆన్‌లైన్లో నిర్వహించాలని నిర్ణయించింది. కానీ టెక్నికల్ సమస్య కారణంగా తొలిరోజే పరీక్ష వాయిదా పడింది.