Skip to playerSkip to main content
  • 5 years ago
హైదరాబాద్‌లో ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సుప్రియో, అభయ్ జంట వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలంగాణలో తొలి గే మ్యారేజ్ చేసుకున్న కపుల్ వీరే కావడం అందుక్కారణం. అభయ్, సుప్రియో ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కొన్నేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. తమ బంధాన్ని ఎన్నాళ్లిలా రహస్యంగా ఉంచాలని ప్రశ్నించుకొని, చివరికి పెళ్లి చేసుకోవడం ద్వారా అందరి ముందుకొచ్చారు. తాము గేలమని వీరికి చిన్నప్పుడే తెలిసిందట.

Category

🗞
News

Recommended