విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రోటోకాల్ బోర్డుపై రామతీర్థం ఆలయ కమిటీ చైర్మన్గా అశోక్ గజపతి రాజు పేరు కనిపించలేదు. ఆలయ ధర్మకర్తగా తనకు అవమానం జరిగిందని అశోక్‌గజపతిరాజు మండిపడ్డారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్‌ను మంత్రి వెల్లంపల్లి కనీసం కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అశోక్‌గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.