ఇద్దరు యువతులు బూతు పురాణం అందుకుని ఆర్టీసీ బస్టాండ్‌లో అందరూ చూస్తుండగా ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని తన్నుకున్నారు. 'ఏంటే నువ్వనేది' అంటూ జుట్టు మెలేసి పిడి గుద్దులు గుద్దుకున్నారు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయి ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అలాగే చూస్తుండిపోయారు. అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే లవర్ కోసం తన్నుకుంటున్నారని తెలిసింది.