ఆంధ్రప్రదేశ్‌లో వంట నూనె ధరలు కొండెక్కాయి. ఇంత ధరలు ఏంటంటే.. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఎఫెక్ట్ అని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, వంట నూనెకు కృత్రిమ కొరత సృష్టించి దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎవరైనా వంట నూనెలను ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.