Heavy Rains in Andhra Pradesh State wide : అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అమలాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది.