Low Pressure Rains in Andhra Pradesh : అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వచ్చిన నీటితో కుంటలు, చెరువులు, జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. ఇళ్లు, పల్లపు ప్రాంతాలు నీట మునగగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే పలు జలాశయాలు నిండటంతో వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.