Minister Jupally Krishna Rao Wash Room Cleaning : ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శౌచాలయాన్ని శుభ్రం చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిలో మంత్రి పర్యటించారు. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయాన్ని జూపల్లి తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్వో ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌ను సైతం మంత్రి పరిశీలించగా, అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్వయంగా ఓ నీళ్ల బక్కెట్ తీసుకొని జగ్గుతో నీళ్లు చల్లి ఫ్లోర్‌తోపాటు గోడలను కూడా మంత్రి శుభ్రం చేశారు. అనంతరం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఉపయోగించే వాష్‌రూమే ఇంత అపరిశుభ్రంగా ఉంటే ఇక సామాన్యులు వినియోగించే శౌచాలయాల పరిస్థితి ఏంటని నిలదీశారు. శుభ్రత విషయంలో తమ వైఖరి మార్చుకోవాలని అధికారులకు జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. అనంతరం స్థానికులు ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్ల స్థితిగతులను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు.
Comments