Skip to playerSkip to main content
  • 4 weeks ago
Minister Lokesh Visit Amruthapuri Asramam in Keralam : కేరళం రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్​కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఆశ్రమ ప్రాంగణంలోని కాళీ దేవాలయాన్ని, కలరిని మంత్రి సందర్శించారు. మంత్రి రాకతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ గజరాజులకు పండ్లు తినిపించారు. అనంతరం ఆలయం ప్రాంతంలో కలయ తిరుగుతూ ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు.అనంతరం మాతా అమృతానందమయి దేవితో మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయి ఆశీస్సులు పొందారు. తరువాత ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్​ను, అమృత ఆయుర్వేద కళాశాలను మంత్రి సందర్శించారు. అక్కడి మౌలిక వసతులు, విద్యాబోధన గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు ఆశ్రమంలో గడిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్​తో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీ పడ్డారు. అనంతరం బోటులో తిరుగుతూ కేరళం అందాలను తిలకించారు.

Category

🗞
News
Transcript
00:01Thank you very much.

Recommended