Garuda Seva Umbrellas for Tirumala Brahmotsavam : తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన హిందూ ధర్మార్థ సమితి 11 పట్టు గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజున స్వామివారికి అలంకరణగా వీటని వినియోగించనున్నారు. సెప్టెంబరు 13న చెన్నై చెన్నకేశవ పెరుమాళ్ ఆలయం నుంచి హిందూ ధర్మార్థ సమితి గొడుగులతో యాత్ర ప్రారంభించింది. నిన్న రాత్రి తిరుచానూరు ఆలయంలో పద్మావతి అమ్మవారికి రెండు గొడుగులను అందజేశారు. ఇవాళ తిరుమల చేరుకొని శ్రీవారి ఆలయం ముందు సదరు సమితి ట్రస్ట్ ఆర్ ఆర్.గోపాల్ జీ, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి గొడుగులను అందజేశారు. వరుసగా 22వ సారి శ్రీవారికి గొడుగులను సమర్పించడం విశేషం. నాలుగు తిరువీధుల్లో గొడుగులను ఊరేగించి ఆలయంలోకి తీసుకెళ్లారు. రేపు సాయంత్రం గరుడ సేవలో ఈ గొడుగులను వినియోగించనున్నారు.
Comments