Skip to playerSkip to main content
  • 10 minutes ago
Six Foot Long Cobra Swallowed 12 Eggs: అతిగా తింటే అమృతమైన విషమవుతుంది అనడానికి విశాఖలో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. ఆకలితో ఉన్న ఓ భారీ నాగుపాము ఏకంగా డజను గుడ్లను ఒక్కసారిగా మింగేసింది. ఆపై ఆ బరువు మోయలేక ఉక్కిరిబిక్కిరైంది. సుమారు 6 అడుగుల పొడవు ఉన్న నాగుపాము ఒకేసారిగా 12 గుడ్లను మింగేయడంతో దాని పొట్ట విపరీతంగా పెరిగిపోయింది. కనీసం కదలలేని స్థితికి చేరుకుంది. ఇదంతా గమనించిన స్థానికులు భయాందోళనలతో వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్‌ నాగుపామును చాకచక్యంగా బంధించారు.అడవిలోకి పాము: ఈ క్రమంలో ఆ పాము మింగిన గుడ్లను ఒక్కొక్కటిగా బయటకు కక్కేయడం చూసి అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. ఎట్టకేలకు స్నేక్ క్యాచర్ ఆ నాగుపామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.  గుడ్లు పెట్టిన కోడి చనిపోయిందని, పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతానని కిరణ్‌ తెలిపారు.

Category

🗞
News

Recommended