Skip to playerSkip to main content
  • 9 hours ago
Chandrababu congratulates medal winners : ఆసియా క్రీడలు 2026లో విశేష ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన క్రీడాకారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ముఖ్యమంత్రిని ఆసియా క్రీడల విజేతలు రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు సాధించిన పతకాలు, వారి అత్యుత్తమ ప్రదర్శనను సీఎం కొనియాడారు. అంతర్జాతీయ వేదికలపై మాతృభూమి పేరును నిలబెట్టిన క్రీడాకారుల ప్రతిభను అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి అంతర్జాతీయంగా రాణించాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో క్రీడాకారులు శ్రీచరణి, గణేష్ మణిరత్నం, ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ ఉన్నారు. మొత్తంగా 3 రకాల క్రీడాంశాల్లో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలను మన రాష్ట్ర క్రీడాకారులు కైవసం చేసుకున్నారని సీఎం చంద్రబాబుకు శాప్ ఎండీ భరణి వివరించారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం తరఫున పూర్తి ప్రోత్సాహం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Category

🗞
News

Recommended