Skip to playerSkip to main content
  • 6 hours ago
Fire Accident At Sabar Nagar : హైదరాబాద్​ తప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సబర్‌నగర్‌లో ఫర్నిచర్‌ గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెండు ఫైర్‌ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఆసిఫ్‌నగర్‌, తప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్ల పరిధిలో పెద్ద సంఖ్యలో ఫర్నిచర్‌ గోదాములు ఉన్నాయని, గత ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో 10 నుంచి 15 అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. నివాస ప్రాంతాల్లో వాణిజ్య గోదాముల నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించి, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Category

🗞
News
Transcript
00:02This is a production of the U.S. Department of State, California, and the U.S. Department of State.

Recommended