Skip to playerSkip to main content
  • 5 minutes ago
Jains Rally In Kurnool :  కర్నూలు జిల్లాలో జైన్ శ్వేతాంబర్ మూర్తి పూజక్ సంఘ్ ఆధ్వర్యంలో జైన్ మతస్థులు భారీ శోభాయాత్ర (ర్యాలీ) నిర్వహించారు. ఆత్మ కల్యాణం కొరకు జైనులు అత్యంత నిష్ఠతో చేపట్టిన కఠిన ఉపవాస దీక్షల ముగింపును పురస్కరించుకుని నగరంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. స్థానిక జైన్ దేవాలయం నుంచి చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న మహావీర్ చౌక్ వరకు ఈ ర్యాలీ వైభవంగా సాగింది. ఈ ఆధ్యాత్మిక ర్యాలీని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్​ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జైనుల సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో ఉత్తమమైనవని, సమాజానికి వారి జీవన విధానం ఆదర్శనీయమని కొనియాడారు. మొత్తం 82 మంది జైన్ మతస్థులు తమ ఆత్మ కల్యాణం కోసం 88 రోజుల పాటు ఈ కఠిన ఉపవాస దీక్షలను చేపట్టారు. ఈ 88 రోజులలో వీరు ఒకరోజు పూర్తిగా ఉపవాసం ఉంటూ, మరుసటి రోజు కేవలం ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ దీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. దీక్షలను పూర్తి చేసుకున్న భక్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కూర్చోబెట్టి నగర పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ వేడుకలో జైన్ సంఘ్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.

Recommended