Anakapalle 2 Month old Baby Long Hair Record : అనకాపల్లి జిల్లాకు చెందిన సుమారు రెండు నెలల వయసున్న చిన్నారి ప్రత్యేక గుర్తింపు పొందింది. పుట్టుకతో వచ్చిన సహజమైన జుట్టుతో ప్రపంచ రికార్డు సాధించింది. మునగపాక మండలం ఉమ్మలాడకు చెందిన సందీప్ దొర, భవాని దంపతులకు ఈ ఏడాది సెప్టెంబరు 18న కుమార్తె దియ్య యశిక శ్రీ జన్మించింది. నెలరోజుల వయసులోనే చిన్నారికి 6 నుంచి 7 సెంటీ మీటర్ల పొడవుతో జుట్టు పెరిగింది. ఆ వయసుతో పోలిస్తే పెరిగిన జట్టు 6 రెట్లు అధికం. దీంతో కుటుంబ సభ్యులు బుక్‌ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు ప్రతిపాదనను పంపారు. సంస్థ ప్రతినిధులు వివరాలు అన్నీ పరిశీలించి చిన్నారి యాషిక శ్రీ పేరుతో రికార్డు నమోదు చేస్తూ అక్టోబరు 19న ధ్రువపత్రం పంపించారు. చిన్నారి పేరుతో అరుదైన రికార్డు నమోదు కావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఉమ్మలాడ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.