• 17 minutes ago
Swimming Competition In Yanam : ఈ నెల 21న జరగనున్న 'ప్రపంచ మత్స్య దినోత్సవం' పురస్కరించుకుని, కాకినాడ జిల్లాలోని ముమ్మిడివరం సమీపంలో ఉన్న యానాం కేంద్రపాలిత ప్రాంతంలో విద్యార్థుల కోసం ఈత పోటీలను నిర్వహించారు. యానాం శాసనసభ్యుడు, పుదుచ్చేరి ప్రభుత్వ మత్స్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు మార్గనిర్దేశంలో,  యానాం స్థానిక మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గొంతియ్య‌‌‌ నేతృత్వంలో ఈ పోటీలు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్విమ్మింగ్ పూల్‌లో జరిగాయి. మొత్తం 150 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో నిలిచిన ముగ్గురిని, అలాగే ప్రోత్సాహక బహుమతుల కోసం మరో 25 మందిని ఎంపిక చేశారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నారు. మొదటి స్థానానికి రూ.5,000, రెండవ స్థానానికి రూ.3,000, మూడవ స్థానానికి రూ.2,000, ప్రోత్సాహక బహుమతులు పొందిన 25 మందిలో ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నగదును, ఈ నెల 21న జరగనున్న ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్లో మంత్రి మల్లాది కృష్ణారావు చేతుల మీదుగా అందజేస్తారు.

Category

🗞
News
Transcript
00:00What

Recommended