• 13 minutes ago
Kakinada Road Accident : కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు మధ్యలో ఆగిన బైక్‌ను తప్పించబోయి ఓ కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలోని క్రాస్‌ దాటి ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సరస్వతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నవారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన క్షతగాత్రులను రాగంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం కట్టుభీమవరానికి చెందిన 14 మంది మహిళలు రెండు కార్లలో గురువారం రాత్రి దైవదర్శనానికి వెళ్లారు. శుక్రవారం పంచారామ క్షేత్రాలను దర్శించుకుని అన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి కారణం ఓ వ్యక్తి బైక్‌పై రోడ్డు దాటుతూ మధ్యలో ఆగిపోవడం వల్లే జరిగినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డు ‌అయ్యాయి. ఘటన జరగ్గానే బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు.

Category

🗞
News
Transcript
00:00I
00:58Transcription by CastingWords
01:06Transcription by CastingWords

Recommended