• 4 minutes ago
Victory Celebration in Vijayawada Corporation: విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి విజయోత్సాహం ఆత్మీయ సమ్మేళనంగా మారింది. నూతన మేయర్ వంగవీటి రాధా, కూటమి కార్పొరేటర్లకు ఎంపీ కేశినేని చిన్ని తన కార్యాలయంలో అభినందన విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాధాను ఎంపీ కేశినేని చిన్ని, ఆయన సతీమణి జానకి లక్ష్మి శాలువాతో సత్కరించారు. నూతన కార్పొరేటర్లను కూడా ఘనంగా అభినందించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్నతో పాటు కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం మేయర్ రాధా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి కేక్ కట్ చేసి విజయోత్సవం జరుపుకున్నారు. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సమన్వయంతో పని చేయాలని నేతలు ఆకాంక్షించారు.విజయవాడ నగరపాలక సంస్థలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరింది. మేయర్, కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. నగరంలోని అంబేడ్కర్‌ కళావేదికలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. తొలుత మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ, ఆ తర్వాత నగరంలోని 86 వార్డుల కార్పొరేటర్లు ప్రమాణం స్వీకారం చేశారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
00:40Thank you for listening.

Recommended