• 10 minutes ago
చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను, అసలైన కరెన్సీగా నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఆరుగురిపై కేసు నమోదు చేయగా, నలుగురు నిందితులను వారు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 99 నోట్ల కట్టలను, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే వేరే కేసులో అరెస్టయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. బాధితుల నుంచి రూ.8 లక్షలు కాజేసినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులు మరో కేసులో రిమాండ్​లో ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి మోసాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వవద్దని, కరెన్సీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా అనుమానాస్పద మోసాలకు పాల్పడితే దగ్గరలోని పోలీస్ స్టేషన్​లో సంప్రదించాలని సూచించారు. 

Category

🗞
News
Transcript
00:28Transcription by CastingWords
00:40Transcription by CastingWords
01:08Transcription by CastingWords
01:38Transcription by CastingWords
01:44Transcription by CastingWords
02:15Transcription by CastingWords
02:18Transcription by CastingWords
02:19Transcription by CastingWords

Recommended