• 4 minutes ago
Actress Meenakshi Chaudhary and Producer BVSN Prasad Visits Tirumala : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం జరిగిన వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీనటి మీనాక్షి చౌదరి, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ వేర్వేరుగా తిరమల స్వామివారిని దర్శించుకున్నారు. ఆనంద నిలయంలోని మూలవిరాట్​ను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి నటిస్తున్న చిత్రాలు విజయవంతం కావాలని, రాబోయే ప్రాజెక్టులు మంచి విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు సమాచారం. శ్రీవారిని దర్శించుకున్న సెలబ్రిటీలను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. అలానే బీవీఎస్​ఎన్​ ప్రసాద్ నిర్మాతగా వృషకర్మ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోగా నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే.

Category

🗞
News
Transcript
00:26Thank you for listening.

Recommended